ఆయన చెప్పారని ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ని పవన్ ఒప్పించాడా..?
on Nov 21, 2017
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంభినేషన్.. ఇది ఎన్నో ఏళ్లుగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కల. "చేస్తున్నాం".. "అతి త్వరలో చేయబోతున్నాం" అనే మాట వీరిద్దరూ ఎన్నో సార్లు చెప్పారు. కానీ అది పట్టాలెక్కిన సందర్భం మాత్రం లేదు.. అలాంటి క్రేజీ కాంభినేషన్లో సినిమా ఎనౌన్స్ అవ్వడం.. దానికి కొబ్బరికాయ కొట్టడం అంతా చకచకా జరిగిపోయింది. గతంలో అన్నీ అనుకూలంగా ఉన్నా జూనియర్‌తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు.. అలాంటిది ఉన్నట్లుండి ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణం ఏంటని ఫిల్మ్‌నగర్‌లో డిస్కషన్ నడుస్తోంది. దీని వెనుక ఏదో అదృశ్యశక్తి ఉందట... ఆ శక్తి ఎవరో కాదు.. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నందమూరి కుటుంబంతో పాటు టాలీవుడ్‌లోనూ జూనియర్ ఎన్టీఆర్ పాపులారిటీ బాగా పెరుగుతోంది..
దీనిని గమనించిన అపర చాణుక్యుడు తన చాణక్యానికి పని చెప్పారు. ఇప్పటి నుంచే జూనియర్ని లైన్లో పెడితే ఎన్నికల నాటికి తన దారికి తెచ్చుకోవచ్చన్నది బాబు ఆలోచనట. దీనిలో భాగంగా పవన్ ద్వారా త్రివిక్రమ్‌ని సెట్ చేశాడట. ఎందుకంటే పవన్ అంటే త్రివిక్రమ్.. త్రివిక్రమ్ అంటే పవన్ కదా..? పవర్‌స్టార్‌కు ఇచ్చిన మాట మీదే త్రివిక్రమ్ శ్రీనివాస్ వర్క్ స్టార్ట్ చేశాడట. అలా పవన్‌కు ఎన్టీఆర్‌ని బాగా దగ్గర చేసి వారిద్దరిని తనకు అనుకూలంగా ఉంచుకునేలా టీడీపీ అధినేత పావులు కదుపుతున్నారని సినీ, రాజకీయ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అభిమానుల చిరకాల వాంఛ మాత్రం తీరింది.