పవన్ కాకపోతే..చరణ్ అట!
on Nov 18, 2017
సందీప్ రెడ్డి వంగా కొండకు వెంట్రుకేసి లాగుదామని చూస్తున్నాడు. వస్తే కొండ వస్తుంది. పోతే వెంట్రుకేగా పోయేది అనేది ఈ యువ దర్శకుని ఆలోచన. ఒక సినిమా హట్ అయ్యిందో లేదో... ఏకగా పవర్ స్టార్ కే లెక్కపెట్టేశాడు సందీప్ రెడ్డి. ఎలాగైనా పవర్ స్టార్ తో ఓ హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు. మైత్రీ మూవీమేకర్స్ వారికి ఓ కథ కూడా చెప్పాడు. త్వరలో పవన్ కి కూడా చెప్పనున్నాడు. ఆయన ‘ఓకే’ అంటే.. సినిమా పట్టాలెక్కినట్టే.అయితే.. పవన్ నుంచి అంత తేలిగ్గా సిగ్నల్స్ రావు. అసలు వచ్చే పరిస్థి లేదు. ఇప్పటికే ఉన్న సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు పవన్. అయితే... సందీప్ ఆలోచన వేరేలా ఉంది. అన్నీ కుదిరితే...పవన్ తో చేస్తాడట. కుదరపోతే... రామ్ చరణ్ తో అయినా చేస్తాడట.అందుకు తగ్గట్టే కథను రెడీ చేసుకున్నాడు. రామ్ చరణ్ తో సినిమా చేయడం తేలిక అనుకుంటున్నాడేమో కుర్రాడు. అది కూడా అంత తేలికైన విషయం కాదు. మరి ఈ ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు అనుకున్నది సాధిస్తాడా? లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.