కారులో బట్టల్లేకుండా వరుణ్?
on Sep 25, 2017
సెలబ్రిటీల సమస్యలు మామూలుగా ఉండవండీ బాబోయ్. కెమెరా కళ్లన్నీ వారి వైపే చూస్తుంటాయ్. దాంతో ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు పాపం. ఒక ఫంక్షన్ లో కనిపించిన డ్రెస్ తో మరో ఫంక్షలో కనిపించరు. ఒక్కోసారి వెంటవెంటనే.. వేడుకలు హాజరు కావాల్సివస్తుంది. దాంతో బట్టలు మార్చుకునే టైమ్ కూడా ఉండదు. కానీ... మార్చాలి. అలాంటి సందర్భంలో ఏం చేస్తారూ... కారులోనే మార్చేసుకుంటారు. ఇదంతా మగాళ్ల సంగతే లేండి. పాపం.. ఆడవాళ్లకైతే.. ఆ అవకాశం కూడా ఉండదు. అయితే... అలాంటి సందర్భమే ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఒకప్పుడు ఫొటోగ్రాఫర్లతోనే భయం ఉండేది. ఇప్పుడైతే... అందరూ ఫొటోగ్రాఫర్లే. మన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ రీసెంట్ గా అలాంటి చిక్కుల్లోనే పడ్డాడు. అసలేం జరిగిందంటే...
ప్రస్తుతం వరుణ్ ధావన్.. ‘జూడ్వా 2’ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. తెలుగు ‘హలో బ్రదర్’ చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రంలో జాక్వలైన్ ఫర్నాండేజ్, తాప్సీ పొన్ను కథానాయికలు. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న వరుణ్ ధావన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్... ఆ తర్వాత వారాంతంలో గాయని ఫాల్గునీ పాథక్ నిర్వహించిన దాండియా నైట్ కి హాజరయ్యారు. దాని తర్వాత వెంటనే... వారు అంబానీ నివాసంలో విందుకు హాజరవ్వాల్సి వచ్చింది. దాంతో... జాక్వలైన్ డ్రస్ బాగానే ఉండటంతో... ఆమె పార్టీకి రెడీ అయిపోయింది. కానీ.. వరుణ్ ధావన్ డ్రస్ మాత్రం బాగా నలిగిపోయింది. దాంతో డ్రస్ మార్చాల్సిన పరిస్థితి. దరిదాపుల్లో ఒక్క రూమ్ కూడా లేదు. చుట్టూ జనం. దాంతో... జాక్వలైన్ కారులో డ్రస్ ఛేంజ్ చేసుకున్నాడు వరుణ్ ధావన్.
పాపం... డ్రస్ మార్చుకుంటూ నన్నెవరూ చూడటంలేదనే భ్రమలో ఉన్నాడు వరుణ్... కానీ.. తాను డ్రస్ మార్చుకోవడం మొత్తం ఫోన్ లో రికార్డు చేసేసింది జాక్వెలెన్ ఫెర్నాండజ్. పైగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ‘వరుణ్ ఓ పార్టీని నుంచి మరో పార్టీకి ఇలా వెళ్తాడు. కారులోని బట్టలు మారుస్తాడు. థ్యాంక్యూ వరుణ్... నా కారుని ఛేంజ్ రూమ్ చేసినందుకు’ అని పోస్ట్ కూడా పెట్టింది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసి వరుణ్ ధావన్ లబోదిబో అంటున్నాడట.