‘బాహుబలి’కీ ‘జై లవకుశ’కు మధ్య ఆ పోలిక?
on Sep 23, 2017
అనుకొని చేస్తారో... అనుకోకుండా అలా జరిగిపోతాయో... తెలీదు కానీ... సినిమా కథల్లో అనుకోకుండా పోలికలు కనిపిస్తుంటాయ్. గతంలో కూడా ఒకే పాయింట్ తో వచ్చిన కథలు కోకొల్లలు. ఈ ఏడాది అలాగే... ఒకే పాయింట్ తో సినిమాలొచ్చాయ్. అవి కూడా సాదాసీదా హీరోల సినిమాలు కావు. స్టార్ హీరోలు చేసిన సినిమాలు. పరిశీలించి చూస్తే... రెండు సినిమాల పాయింట్లు ఒకేలా అనిపిస్తాయ్. ఆ సినిమాలేంటో కనుక్కోండి చూద్దాం. చెప్పలేరా? అయితే చెబుతాం వినండి.
వారు అన్నాదమ్ములు. రక్తం ఒకటే అయినా... ఈర్ష్యా, ద్వేషాలు వారిని వేరు చేస్తాయ్. చివరకు తోడబుట్టినవాడి చావుని కోరుకునేలా చేస్తాయ్. మెయిన్ లైన్ ఇదే. ఈ మధ్య ఇదే లైన్లో వచ్చిన సినిమాలు ఏంటి? గుర్తొస్తున్నాయా? ఎస్... ‘బాహుబలి’.. ‘జై లవకుశ’. రెండూ... తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోతే.. పిల్లలు ఎలా తయారవుతారో చెప్పిన సినిమాలే. అయితే... ‘బాహుబలి’ ఫోక్లర్ మూవీ. ‘జై లవకుశ’ సాంఘిక చిత్రం. ‘బాహుబలి’లో అన్నదమ్ములు ఇద్దరే. ‘జై లవకువ’లో ముగ్గురు కవలలు. ముగింపులు మాత్రం భిన్నంగా ఉంటాయ్.
ఏది ఏమైనా... ఈ సినిమాల ద్వారా ప్రతి తల్లీ, ప్రతి తండ్రీ నేర్చుకోవలిసిన విషయం ఒకటుంది. పిల్లలకు ప్రేమ పంచే విషయంలో ఎక్కువ తక్కువలు చూపించకూడదు. ఇద్దరినీ సమదృష్టితో చూడాలి. ఒకేలా ప్రేమనందించాలి. ‘అమ్మానాన్నలకు మేం రెండు కళ్లు’ అని పిల్లలు నమ్మాలి. అప్పుడు అన్నదమ్ముల మధ్య రమన్నా గొడవలు రావ్. పసితనంలో ఏర్పడే ప్రభావం చివరి వరకూ బలంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అందుకే సున్నితమైన పసి హృదయాలపై గాయం చేయకండి.
ఇలాంటి మంచి, విలువైన విషయాన్ని తమ సినిమాల ద్వారా తెలియజేసిన ఎస్.ఎస్.రాజమౌళీ, ఎస్.కె.బాబీ లను గట్టిగా అభినందించాల్సిందే. ఏమంటారు ఫ్రెండ్స్?