అక్కడ వయాగ్రా పొట్లాలు చూపిందట!
on Sep 22, 2017
పుండుమీద కారం పెట్టడం అంటారే... అదే పని చేసింది బాలీవుడ్ అందాలభామ రాఖీ సావంత్. ప్రస్తుతం ఈమె డేరాబాబాపై తీస్తున్న ఓ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డేరా బాబా ఆశ్రమంపై ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ‘ఓ సారి నేను కూడా డేరాబాబా ఆశ్రమానికి వెళ్లాను. అప్పుడు నాకు వయాగ్రా పొట్లాలు కనిపించాయ్. సన్యాసికి వయాగ్రాతో పనేంటబ్బా అనుకున్నాను. అసలు విషయం తర్వాత బయట పడింది’ అంటూ రాఖీ చెప్పిన విశేషాలు ఇప్పుడు మీడియా సర్కిల్ లో వైరల్ గా మారాయ్.
డేరా బాబాపై వస్తున్న ఎలిగేషన్లతో పాటు ఇప్పుడు కొత్తదాన్ని రాఖీ లేవనెత్తడంతో డేరాబాబా భక్తులందరూ రాఖీపై అంతెత్తు లేస్తున్నారు. ‘సిగ్గూ ఎగ్గూ లేకుండా... పొదుపైన బట్టలతో కెమెరా ముందు నర్తించే నర్తకికి డేరాబాబా విలువ ఎలా తెలుస్తుంది?’ అంటూ మండిపడుతున్నారు. శ్రేయోభిలాషులు మాత్రం... ‘రాఖీ... ! నీ కెందుకమ్మా ఈ రచ్చ? చక్కగా నీ పనేదో నువ్వు చేసుకొని వెళ్లిపోవచ్చు కదా!’ అంటూ హితవు పలుకుతున్నారు.