జైలవకుశ ఫస్టాఫ్ రివ్యూ
on Sep 21, 2017
కెరీర్లోనే తొలిసారిగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ చేస్తోన్న జైలవకుశ మూవీ ఇవాళ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ఫస్ట్‌లుక్, మూడు క్యారెక్టర్లకు సంబంధించిన టీజర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. సోషల్ మీడియా యాక్టివ్‌గా మారిన నేపథ్యంలో.. ఇప్పటికే ఓవర్సీస్లో ఈ చిత్రం ప్రదర్శించడటంతో ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సన్నిహితులతో పంచుకుంటున్నారు. ఫస్టాఫ్ అంతా కుశ ఎంటర్టైన్మెంట్తో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుందట. మధ్యలో లవ వచ్చినప్పటికీ కుశ డామినేషన్లో తేలిపోయాడట..అయితే లవ, రాశిఖన్నా మధ్య లవ్ ట్రాక్ బాగుందట. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌కు కొన్ని నిమిషాల ముందు జై ఎంట్రీ ఇస్తాడట..ఫస్టాఫ్‌లో వచ్చే రెండు పాటలు బాగున్నాయట..మరి సెకండాఫ్‌లో ఎన్టీఆర్ తన విశ్వరూపాన్ని ఏ రేంజ్లో చూపాడో తెలుసుకోవాలంటే ఫుల్ రివ్యూ కోసం కొద్ది సేపు వెయిట్ చేయండి.