'రాజా ది గ్రేట్' టీజర్ రివ్యూ.... మైనస్సే ప్లస్ అయ్యింది..!
on Aug 15, 2017
మాస్ మహారాజ్ రవితేజ ఈసారి ఢిఫరెంట్ లుక్ తో వస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ అంధుడిగా కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఇటీవలే వచ్చినా..ఈరోజు ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ఇక ఈ టీజర్ లో వచ్చిన ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు’ అన్న డైలాగ్ కు రవితేజ రివర్స్ కౌంటర్ గా ‘నోర్ముయ్.. ఆ నయనాలు లేకుండానే పాతికేళ్ల నుంచి కుమ్మేస్తున్నానిక్కడ. మిగతా పార్టులు అమ్మేసుకుంటారా? సర్వేంద్రియానాం సర్వం ప్రధానం’ అని చెబుతున్న డైలాగ్ అందరిని ఆకట్టుకంది. ఇంకా నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేక పోవచ్చు. కానీ నా కొడుకేంటన్నది ఈ ప్రపంచం చూడాలి" అంటూ నటి రాధిక చెప్పిన డైలాగుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ''అయామ్ బ్లైండ్ .. బట్ అయామ్ ట్రైన్డ్" అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలెట్ అయింది. అంతేకాదు.. ఈసినిమాలో రవితేజ బ్లైండ్ గా రావడంపై అది సినిమాకు మైనస్ అవుతుందేమో అన్న టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఆ మైనస్సే ప్లస్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇంకా రవితేజ లుక్ కూడా సూపర్ప్ అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి టీజర్ వరకూ అయితే ఓకే.. సినిమా రవితేజకు హిట్ ఇస్తుందో..? లేదో..? చూద్దాం..
కాగా అనిల్ రవిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఇందులో రాధిక రవితేజ తల్లి పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.