డ్రగ్స్ మత్తులో తూగుతున్న హీరోయిన్...!
on Jul 26, 2017
ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది డ్రగ్స్ వ్యవహారం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా ఈ వ్యవహారంలో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారని ఎప్పుడైతే తెలిసిందో.. అప్పుటినుండి ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. మరోవైపు పోలీసులు ఏ తీగ లాగితే ఎక్కడ డొంక కదులుతుందోనని సెలబ్రిటీల్లో వణుకు మొదలైంది. ఇక కొంత మంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని నోరు కూడా మెదపడంలేదు. కానీ ఇక్కడ ఓ హీరోయిన్ మాత్రం డ్రగ్స్ పై ఉన్న తన అభిప్రాయాన్ని కాస్త విభిన్నంగా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? 'నువ్వు నేను' సినిమాతో హిట్ కొట్టిన నటి అనిత.
టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన ఆమె.. డ్రగ్స్ వాడటం మంచిది కాదంటూ .. మత్తులో తూగుతూ మైమరిచిపోయిన హాట్ లుక్‌లో ఫోటోకి ఫోజు ఇచ్చి.. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. బ్లాక్ అండ్ వైట్ లో ఫుల్ షర్ట్ వేసుకొని.. పక్కన డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నట్టు... లైటర్, స్పూన్‌తో ఎక్కడికీ కదల్లేని స్థితిలో ఉన్నట్టుగా ఫోటోకి ఫోజు ఇచ్చి ‘సే నో టు డ్రగ్స్’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది. మొత్తానికి ఈ హీరోయిన్ పెట్టిన ఫొటోతో మెసేజ్ ఇవ్వడం సంగతేమో కానీ..తన హాట్ లుక్ తో అందరికి మతి పోగొడుతుందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు..