సినిమాల్లోకి రాకముందు చరణ్... శ్రియతో...!
on Jul 26, 2017
రామ్ చరణ్, శ్రియ జంటగా నటించారు తెలుసా?
ఇది ‘చిరుత’కు ముందు మాట.
అదేంటి? ‘చిరుత’ రామ్ చరణ్ తొలి సినిమా కదా! మరి అంతకు ముందే వారిద్దరూ కలిసి నటించడం ఏంటి? అనే కదూ మీ అనుమానం? అవును... వారిద్దరూ కలిసి నటించారు. ఏ సందర్భంలో వారు కలిసి నటించారో తెలుసుకోవాలనుందా? విషయం ఏంటంటే... రామ్ చరణ్ హీరో కాకముందు ముంబయ్ లోని ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్, డాన్సింగ్, ఫైట్స్ విషయాల్లో ఏడాది పాటు శిక్షణ తీసుకున్నాడు.. ఆ సమయంలోనే యువ నటీనటుల్లో ఉత్సాహం
నింపేందుకు అప్పటికే టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శ్రియను నిర్వాహకులు ప్రత్యేక అతిథిగా ఇనిస్టిట్యూట్ కు ఆహ్వానించారు. అప్పుడే రామ్ చరణ్, శ్రియ కలిసి సరదాగా ఓ సన్నివేశంలో నటించారు. దాదాపు దశాబ్దం క్రితమే జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. చరణ్ అప్పుడప్పుడే నటన నేర్చుకుంటూ ఉండటంతో... కాస్తంత బెరుగ్గా.. తడబడుతూ ఆ సన్నివేశంలో నటించినట్లు ప్రస్ఫుటంగా తెలుస్తోంది. అయితే... శ్రియ అప్పటికే టాప్ హీరోయిన్. ముఖ్యంగా తను స్టేజ్ ఆర్టిస్ కూడా కావడం చేత ఓ రేంజ్ లో ఇరగదీసేసిందనే చెప్పాలి. ఏది ఏమైనా...అనుకోకుండా ఆ రోజుల్లో వాళ్లు సరదాగా చేసిన వీడియో... ఇప్పుడు యూ ట్యూబ్ లో వైరల్ గా మారడం నిజంగా విశేషమే. మెగా అభిమానులకు ఈ వీడియో ఓ తమాషా అనుభూతినిస్తోందని వేరే చెప్పాలా?
Also Read