ప్రియురాలికి అన్నగా నటించడం అంటే... నరకమే కదా!
on Jul 24, 2017
ఇది దాదాపు ఓ పద్దెనిమిదేళ్ల నాటి మాట. అప్పట్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఎదురైన ఓ గడ్డు సమస్య.. దాని పరిణామాల గురించిన కథనం ఇది.
ఏ నటుడికైనా... ఇబ్బంది కలిగించే అంశం ఏంటంటే... తాను ప్రేమించిన అమ్మాయికి అన్నగా నటించడం. ఇలాంటి ప్రపోజలే అప్పట్లో సల్మాన్ కి వచ్చింది. మన్ఫూర్ అలీ ఖాన్ అనే దర్శకుడు ఓ కథతో సల్మాన్ ని కలిశాడు. అది స్టార్ హీరో మాత్రమే చేయాల్సిన కథ. ఆ పాత్రకు సల్మాన్ ని అడిగాడు. కథ కూడా సల్మాన్ కి బాగా నచ్చింది. చేయడానికి ‘ఓకే’ చెప్పేలోపే... అసలు విషయం చక్కా చెప్పాడు ఆ దర్శకుడు. ఈ కథలో హీరో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు అప్పటికే ఐశ్వర్య రాయ్ ని కన్ఫామ్ చేసుకున్నాట్టు వివరించాడు. అంతే... సల్మాన్ షాక్.
దానికి కారణం అప్పటికే సల్మాన్, ఐశ్వర్యరాయ్ పీకలలోతులో ప్రేమలో ఉన్నారు. మరి ప్రేయసికి అన్నగా నటించడం అంటే... దాన్ని మించిన నరకం వేరే ఏముంటుంది చెప్పండి? అందుకే... ఆ సినిమా చేయనని ఖరాకండీగా చెప్పేశాడు. చివరకు ఆ పాత్ర షారుఖ్‌ని వరించింది. ఆ సినిమా పేరు ‘జోష్’.
ఇదిలావుంటే... దాదాపు రెండేళ్లు ప్రేమలో మునిగి తేలిన సల్మాన్, ఐశ్వర్య... విడిపోవడం కూడా నిజంగా వింతగానే జరిగింది. సల్మాన్ కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించినా... తనకు ఐశ్వర్య మాత్రం స్పెషల్. నిజంగా తనను పెళ్లాడాలనే అనుకున్నాడు సల్మాన్. అంతేకాదు... ఐశ్వర్యను తన సొంత ఆస్థిలా చూసుకునేవాడు. ఈ అతి ప్రేమ వల్లే... చాలా సందర్భాల్లో ఐశ్వర్య ఇబ్బందులకు గురికావల్సి వచ్చిందట. ఈ కారణంగా ఎన్నోసార్లు వారిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయట. మరో విషయం ఏంటంటే... సల్మాన్ తో చేరవగా ఉండటం.. ఐశ్వర్య తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేకపోయింది. దాంతో... నిదానంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
ఓ సారి... తనను దూరంగా పెడుతోందనే కోపంతో సల్మాన్... ఐశ్వర్య ఇంటిముందు అల్లరి కూడా చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. చివరకు విధి వారిద్దరినీ విడదీసేసింది. పెళ్లిళ్లు స్వర్గాల్లో జరుగుతాయంటారు. అల్రెడీ... అభిషేక్ తో అక్కడ పెళ్లి జరిగిపోయిన తర్వాత... ఇక్కడకొచ్చి ఏం చేసినా... అది విఫలయత్నమే అవుతుంది కదా...! సల్మాన్ పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్ గానే ఉండటానికి ఐశ్వర్యే కారణం అనే వాదన ఉంది.