నానితో ముచ్చటగా మూడోసారి
on Jul 24, 2017
ఒకే హీరోతో వరుసగా సినిమాలు చేసిన హీరోయిన్లు ఒకప్పుడు చాలామందే ఉన్నారు. ఇప్పుడైతే... ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. ఒకవేళ ఒకే హీరో తో రెండుమూడు సినిమాలు చేసినా... వరుసగా చేసే పరిస్థితి మాత్రం లేదు. అయితే... ఆ పద్ధతి మార్చేసింది నివేద థామస్. వరుసగా మూడో సారి.. నానితో జతకట్టనుందామె. నివేద తెలుగు తెరకు పరిచయమైన సినిమా ‘జెంటిల్ మేన్’. ఇందులో కథానాయకుడు నాని. సినిమా మంచి హిట్. నివేద నటించిన రెండో సినిమా ‘నిన్నుకోరి’. ఇందులో కూడా హీరో నేనినే. ఆ సినిమా కూడా సూపర్ హిట్. ప్రస్తుతం ఆమె ఎన్టీయార్ తో ‘జై లవకుశ’చిత్రంలో నటిస్తోంది. ఇదిలావుంటే... త్వరలో ముచ్చటగా మూడోసారి నానితో జతకట్టనుంది నివేద.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని నటించనున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్. ఇప్పటికే... జెండాపై కపిరాజు, జెంటిల్ మేన్ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశాడు నాని. ‘కృష్ణార్జున యుద్ధం’లో తాను ద్విపాత్రాభినయం చేస్తున్న మాట నిజమైతే... నాని ద్విపాత్రాభినయం చేసిన మూడో సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’అవుతుంది. ఇదిలావుంటే... ఇందులోనే ఓ కథానాయికగా నివేద థామస్ ఎంపిక అయ్యింది. ఇలా తక్కువ టైమ్ లో ఒకే హీరోతో ఎక్కువ సినిమాలు చేసిన క్రెడిట్ కొట్టేసింది నివేద. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. మరి ఈ కాంబినేషన్లో ఇంకెన్ని సినిమాలు వస్తాయో చూడాలి.