‘బిగ్ బాస్’ లో ‘బుల్లి టైగర్’
on Jul 22, 2017
‘బిగ్ బాస్ ’ షోలో వచ్చే ఎపిసోడ్ ఆసక్తి కరంగా మారనుందా? వాతావరణం చేస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఇంతకీ అంతగా ఆసక్తిని కలిగించే అంశం ఏమైవుంటుందా? అనుకుంటున్నారా?
ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకి అసలైన అట్రాక్షన్ యంగ్ టైగర్ ఎన్టీయార్. ఆయన తొలిసారి వ్యాఖ్యాతగా ఆ కార్యక్రమం రూపొందుతోంది. మరి కొత్తగా ఆసక్తిని రేకెత్తించే అంశం ఏంటి? అంటే... ‘బుల్లి టైగర్’. మధ్యలో ఈ బుల్లిటైగర్ ఎవరయ్యా బాబూ అనుకుంటున్నారా! ఆగండాగండి. అక్కడికే వస్తున్నా.
బుల్లి టైగర్ అంటే... ఎన్టీయార్ కుమారుడు అభిరామ్. వాతావరణం చూస్తుంటే వచ్చే ఎపిసోడ్ లో అభిరామ్ ‘బిగ్ బాస్’ షోలోకి ఎంటరయ్యేట్టున్నాడు. అంటే... ‘బిగ్ బాస్’హౌస్ లోకి కాదు. తండ్రికి తోడుగా రానున్నాడన్నమాట.
ట్విట్టర్లో తారక్ ఫొటోలు కూడా పోస్ట్ చేసేశాడు. జులై 22 అభిరామ్ పుట్టిన రోజు. తారక్ ఏమో... ఒకవైపు సినిమాలు, మరో వైపు ‘బిగ్ బాస్’ అంటూ బిజీ బిజీ. కొడుకును మిస్సవుతున్న పరిస్థితి. పైగా అభిరామ్ పుట్టిన రోజు. అందుకే... ఇక లాభం లేదనుకున్నాడో ఏమో... ఏకంగా బుల్లి టైగర్ ని వెంటేసుకుని ‘బిగ్ బాస్’ సెట్ కి తెచ్చేశాడు. ఆ సెట్ లోనే అభిరామ్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నాడట తారక్.
తండ్రీ కొడుకులు బిగ్ బాస్ గెటప్పుల్లో సెట్ లో ఉన్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసేసరికి.. అభిమానుల్లో ఎక్కడ లేని ఆనందం. అభిరామ్ వేసుకున్న డ్రస్ పై ఉన్న టైగర్ సింబల్ చూసి... వారందరూ ‘బుల్లి టైగర్’ అని తెర మురిసిపోతున్నారట.