వాళ్లది నిజమా? కృష్ణవంశీది నిజమే?
on Jul 22, 2017
ఓ ప్రముఖ పత్రికకు కృష్ణవంశీ ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఓ హీరోను ‘డైలాగ్ చెప్పడం కూడా రాదు’అంటూ బాహాటంగా దెప్పిపొడిచాడు కృష్ణవంశీ. ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు. ఎవరయ్యుంటారబ్బా...! ఆ హీరో...? .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న. కొందరైతే... ముందు ఆలోచన చేస్తూ... ‘ఆయన అన్నది రామ్ చరణ్ణే’ అని మాట్లాడేసుకుంటున్నారు. మరి కొందరు గోపీచంద్ పేరు చెబుతున్నారు. మరి రామ్ చరణా? గోపీచందా? వీరిద్దరూ కాక ఇంకెవరైనా ఉన్నరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘చాలామంది నాకేదో మేలు చేస్తున్నామనే ఫీలింగ్ లో ఉంటారు. ‘సరిగ్గా రాలేదు ఇంకోసారి చేయ్’ అంటే వాళ్లకు కోపం. అటువంటి వారి
గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది’ అని కూడా అన్నాడు కృష్ణవంశీ. ఉన్నట్టుండి ఇప్పుడు ఈ విమర్శలు గుప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాని పరిస్థితి. కృష్ణవంశీ వెర్షన్ ఇలా వుంటే... పరిశ్రమలో అతని తీరుపై చాలా విమర్శలున్నాయి. తీసిందే తీసి అటు నిర్మాతల్నీ... ఇటు నటీనటులను టార్చర్ పెడతాడని ఆయనపై టాక్ ఉంది. కొందరు నటీనటులు ఆ విషయాన్ని బాహాటంగానే చెప్పిన సందర్భం లేకపోలేదు. మరి ఇక్కడ కృష్ణవంశీ రైటా? లేక ఆయన్ను విమర్శించేవారు చెబుతున్నది రైటా? అనేది ఆ దేవుడికే తెలియాలి.