హాలీవుడ్ రేంజ్‌ని మించిపోయిన అజిత్ వివేగం..!
on Jul 21, 2017
తమిళ స్టార్ హీరో అజిత్..శివ కాంభినేషన్లో వస్తున్న వివేగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. షూటింగ్ టైంలో రిలీజ్ చేసిన అజిత్ లుక్స్, మేకోవర్ అంతా స్టైలీష్‌గా ఉంది. ఇప్పటికే తమిళ్ వెర్షన్లో విడుదలైన ట్రైలర్‌కు అక్కడి అభిమానులు బ్రహ్మారథం పట్టారు. తాజాగా తెలుగు వెర్షన్లో ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. హాలీవుడ్ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా తీసిన ఈ మూవీలో అజిత్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా..బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ విలన్‌గా తన క్రూరత్వాన్ని చూపించనున్నాడు. ఆగస్టులో మూవీని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.