అందగత్తెల పోటీలో విలన్ భార్య
on Jun 28, 2017
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ తెలుగు, తమిళ్లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 24 సినిమాలో హీరో సూర్య పక్కన నటించే అవకాశం కొట్టేసిన అజయ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అయితే, అజయ్ భార్య ఈయనగారిని మించి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఇంతకీ తాను ఏం చేస్తుందో... అదేనండీ ప్రొఫెషన్ ఏంటో చెప్పలేదు కదా! స్వతహాగా మోడల్ అయిన అజయ్ భార్య శ్వేతా రావూరి ఈసారి మిస్సెస్ ఇండియా వరల్డ్ వైడ్ కాంపిటీషన్లో ఫైనల్ బెర్త్ సంపాదించుకుంది. సాధారణంగా, పెళ్లయిన అమ్మాయిలకు ఆంక్షలు పెడుతూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా అమ్మాయిల ఇష్టాలని గౌరవించే వాళ్ళు ఎంత మంది ఉంటారు చెప్పండి. తన భార్యకి నచ్చిన మోడలింగ్ రంగంలో ఒక్కో మెట్టూ ఎదిగే క్రమంలో తన తోడ్పాటు అందిస్తున్న అజయ్ సినిమాల్లో విలన్ అయినా, నిజ జీవితంలో మాత్రం హీరోనే. అయితే, శ్వేతా రావూరి టైటిల్ గెలుచుకోవాలని ఆశిద్దాం!