ఎన్టీఆర్, చరణ్లకి తప్పలేదు, ప్రభాస్ పరిస్థితేంటి?
on May 29, 2017
హిట్లు తప్ప ప్లాపులు తీయడం ఎరుగని రాజమౌళితో జత కట్టడం అంటే ఏ హీరో అయినా సై అంటాడు. బాహుబలి విడుదల తర్వాత అయితే, బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళి తో కనీసం ఒక్క సినిమా చేయాలనుందని బహిరంగంగానే ప్రకటించారు. అసలు, రాజమౌళి తర్వాత సినిమా ఏంటని బోలెడు ఊహాగానాలు, కానీ ఆయన నోరు తెరిచే వరకు ఏదీ నమ్మలేం. ఏది ఏమయినా ఆయనతో నెక్స్ట్ ఎవరు కలిసి పనిచేస్తారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. బాహుబలి రెండు భాగాలు చేసి రాజమౌళితో అయిదు సంవత్సరాలు గడిపే అవకాశం వచ్చిన ప్రభాస్ ని లక్కీయేస్ట్ ఆక్టర్ గా అభివర్ణిస్తున్నారు. అంతకు ముందు టాలీవుడ్ కే పరిమితమయిన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు దేశం మొత్తం వ్యాపించింది. బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాతలు ప్రభాస్ ని హిందీ లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, ఇతగాడు మాత్రం ఇప్పట్లో బాలీవుడ్ సినిమా చేయనని ఖరాఖండీగా చెప్పాడు. ఇదిలా ఉంచితే, ఒక సెంటిమెంట్ మాత్రం ప్రభాస్ ఫాన్స్ ని కొంచెం బాధ పెడుతుంది.
రాజమౌళితో చేసిన ప్రతి హీరోలు తర్వాత వరుస ప్లాప్ లు ఎదుర్కొంటారు అనేది ఒక సెంటిమెంట్. మగధీర తర్వాత రామ్ చరణ్, సింహాద్రి, యమదొంగ తర్వాత ఎన్టీఆర్ లు ప్లాప్ లు చవి చూసారు. నితిన్, రవి తేజ, సునీల్ మరియు నాని కూడా రాజమౌళితో పని చేసిన తర్వాత పరాజయాలు ఎదుర్కొన్నారు. ఇంత మందికి తప్ప లేదు మరి ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ తో సాహూ అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న ప్రభాస్ కి తప్పుతుందా.
ఛత్రపతి తర్వాత ప్రభాస్ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ, ప్రస్తుతం అతనికున్న క్రేజ్ బట్టి రిజల్ట్ ఎలా ఉన్నా సాహూ నిర్మాతలకి భారీ లాభాలు తెస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు... ఎందుకంటే ఇప్పడికే నిర్మాతలకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. బిసినెస్ ఈక్వేషన్స్ పక్కన పెడితే, రాజమౌళి నీడ లోంచి బయటకి వచ్చి తనకి తాను నిరూపించుకోవాలంటే మాత్రం ప్రభాస్ సాహూ తో హిట్ కొట్టాల్సిందే. రాజమౌళి సెంటిమెంట్ ఈసారి రిపీట్ కావొద్దని కోరుకుందాం!
Also Read