బాహుబలికి 360 కోట్లు చిన్న విషయమే!
on Apr 27, 2017
గత రెండు రోజులుగా సినీ ప్రియులు నెట్లో బాహుబలి 2 టికెట్స్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగయినా మొదటి షో చూడాలనేది వారి ఆత్రానికి గల ప్రధాన కారణం. కానీ, బ్యాడ్ లక్ ఏంటంటే ఆన్లైన్ లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కార్పొరేట్ వాళ్ళు మాగ్జిమమ్ టిక్కెట్లు బ్లాక్ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ఏది ఏమయినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే, బాహుబలి 2 బాక్స్ ఆఫీస్ దగ్గిర చరిత్ర సృష్టించేలా కనిపిస్తుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, బాహుబలి 2 దాదాపు 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ప్రపంచ వ్యాప్తంగా కనీసం 360 కోట్ల షేర్లు కలెక్ట్ చేయాలి. వేరే సినిమాకి ఇది ఖచ్చితంగా అసాధ్యమయిన పనే, కానీ బాహుబలి 2 కి అదేమంత పెద్ద టాస్క్ కాదు. బాహుబలి మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా బాహుబలి 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఎలా ఉన్న ఓపెనింగ్స్ కి ఢోకా ఉండదు. ఇప్పటికే దాదాపు అన్ని థియేటర్లలో మొదటి వారానికి టికెట్స్ బుక్ అయ్యాయి. కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే విషయంలో పలు వార్తలు వస్తున్నా, ఈ ప్రక్రియని బిగ్ స్క్రీన్ లో చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. చూద్దాం బాహుబలి 2 ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో!