పవన్‌కి అందనంత దూరంలో చిరు
on Mar 27, 2017
నిన్నటి తరంలో తిరుగు లేని రారాజుగా వెలుగొందిన చిరంజీవి సినిమాలకి కొంత విరామం ఇచ్చి ఖైదీ నెంబర్ 150 తో తాను ఎప్పటికీ బాక్స్ ఆఫీస్ కింగ్ నని నిరూపించారు. డివైడ్ టాక్ తో కూడా పలు రికార్డులు కొల్లగొట్టారు. శ్రీమంతుడు, జనతా గారేజ్ లని దాటి షేర్ల పరంగా తెలుగు ఇండస్ట్రీ లో రెండవ పెద్ద సినిమాగా నిలిచింది ఖైదీ నెంబర్ 150. చిరంజీవి చిరు విరామం తీసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ టాప్ హీరోగా ఎదిగారు. పవన్ క్రేజ్ ముందు ఎవరైనా, అది చిరు అయినా దిగదుడుపే అని కామెంట్స్ వచ్చాయి. కానీ, చిరు ఖైదీ నెంబర్ 150 తో తన సత్తా ఏంటో చాటారు. పవన్ ఆ రికార్డు ని ఈజీ గా కొట్టేయొచ్చు అని చాలా మంది అభిప్రాయపడ్డారు.
కానీ, ఎన్నో అంచనాలతో విడుదలైన కాటమరాయుడు అటు నిర్మాతలకి ఇటు బయ్యర్లకి నిరాశ కలిగించింది. ఖైదీ నెంబర్ 150 రికార్డులు కొల్లగొట్టడం విషయం అటుంచితే, అసలు, దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లే అవకాశం లేదు అంటున్నారు. మొదటి వారాంతంలో ఖైదీ నెంబర్ 150 ప్రపంచ వ్యాప్తంగా 52 కోట్ల పైగా వసూళ్లు రాబట్టగా, కాటంరాయుడు 45 కోట్లు మాత్రమే సాధించింది. ఇదిలా ఉంటే, కలెక్షన్లు ఈ రోజు నుండి మొత్తంగా డ్రాప్ అవుతాయి అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదే గనక నిజం అయితే, పవన్ తనకి తాను మళ్ళీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తానికి అన్నయ్య ఎప్పటికీ బాక్స్ ఆఫీస్ కి అన్నయ్యే అంటున్నారు, మరి మీరేమంటారు!