కాటమరాయుడు మిలియన్ దాటింది, అయినా కష్టమే
on Mar 27, 2017
శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కాటమరాయుడు USA లో మిలియన్ డాలర్ మైలురాయిని దాటింది. ప్రీమియర్ షోలని కలుపుకొని శుక్రవారం 224 స్క్రీన్ లలో 685 వేల డాలర్ లు రాబట్టిన కాటమరాయుడు శనివారం రోజు 208 స్క్రీన్ లకి గాను 243 వేల డాలర్ లు కలెక్ట్ చేసింది. ఆదివారం రోజు పరిస్థితి అయితే మరీ దారుణం. కేవలం 80 వేల లోపు వసూళ్లు సాధించి మొదటి వారాంతానికి గాను మిలియన్ డాలర్ ల మార్క్ ని దాటింది.
ఎక్కువ మొత్తం లో సినిమాని కొన్న ఓవర్సీస్ పంపిణీదారులకి ఈ లెక్క ఒకింత భయాన్ని కలిగిస్తుంది. ట్రేడ్ పండితులు కాటమరాయుడు ఓవర్సీస్ లో బయ్యర్లకి పెద్ద మొత్తంలో నష్టాలు కలిగిస్తుందని జోస్యం చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అంతంత మాత్రం గానే ఉందంటున్నారు.