బాహుబలి-2లా ఈగ-2 కూడా తీస్తే బాగుండు
on Mar 26, 2017
ఈగతో కూడా సినిమా తీయొచ్చు అని నిరూపించి మంచి హిట్ కొట్టారు దర్శకధీరుడు రాజమౌళి. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది..అయితే బాహుబలికి సెకండ్ పార్ట్ తీసినట్లే ఈగకి కూడా సిక్వెల్ తీయాలని ఎంతో మంది రాజమౌళిని అడుగుతున్నారు..కానీ జక్కన్న నుంచి సమాధానం శూన్యం. ఆఖరికి ఆ సినిమా హీరో నాని కూడా ఇదే విషయంపై రాజమౌళిని ప్రశ్నించాడు..హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరిగిన బాహుబలి-2 ప్రి రిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్న నానిని ఇదే విషయంపై సుమ ప్రశ్నించగా..దీనిపై స్పందించిన నాని బాహుబలి పార్ట్-2 త్వరగా పూర్తి చేసి ఈగ పార్ట్-2 తీస్తే తాను హ్యపీగా ఫీలవుతానన్నారు. అలాగే మీరు బాహుబలిలో హీరో అయితే విలన్గా ఎవరుండాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకు నాని తెలివిగా సమాధానం ఇచ్చారు..ఆ పాత్రల్లో వేరెవరినీ ఊహించుకోలేమని..అసలు ఆ ఆలోచనే లేదన్నారు.