అందరికీ ఒక "ఓ" వేసుకోండి
on Mar 26, 2017
బాహుబలిలో నటించడం ఓ మధురస్మృతిగా మిగిలిపోతుందన్నారు రమ్యకృష్ణ. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న బాహుబలి-2 ప్రి రిలీజ్ ఫంక్షన్లో ఆమె మాట్లాడుతూ..అసలు సినిమా గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదన్నారు. ఒక దర్శకుడు ఒకే సినిమా కోసం ఐదేళ్లపాటు పనిచేయాలంటే ఎంత కష్టమో తనకు తెలుసునని రమ్య అన్నారు. తన ఇన్నేళ్ల కెరీర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదని చెప్పింది. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుందని అన్నారు. ఆనందాన్ని ఆపుకోలేక పోయిన ఆమె ఒన్ బిగ్ కేక ప్లీజ్ అంటూ అభిమానుల చేత కేరింతలు పెట్టించారు.