మహేష్‌బాబు కథలో బాలయ్య హీరో!
on Feb 23, 2017
ఓ బడా స్టార్‌ని పట్టేయాలని, తనతో సినిమా చేయాలని, మళ్లీ టాప్‌లీగ్‌లోకి అడుగుపెట్టాలని తహతహలాడిపోతున్నాడు పూరి జగన్నాథ్. రోగ్ విడుదలకు ముందే... పెద్ద హీరోతో సినిమా ఎనౌన్స్ అయితే.. అది రోగ్ ప్రమోషన్లకీ బాగా ప్లస్ అవుతుందని ప్లాన్ చేస్తున్నాడు. అయితే... ఎవ్వరూ కనికనించడం లేదు. ఎందుకంటే పూరిపై ఎవ్వరికీ నమ్మకాల్లేవు. పూరి టైమ్ అయిపోయిందని, ఆ మార్కు సినిమాలు ఇప్పుడు ఎవ్వరూ చూడరన్న నిర్ణయానికి వచ్చేశారు హీరోలు. అయితే అనూహ్యంగా పూరికి బాలకృష్ణ నుంచి సపోర్ట్ వచ్చింది.
`మంచి కథ చెప్పు.. తప్పకుండా చేద్దాం` అంటూ బాలయ్య ఆమధ్య పూరికి ఆఫర్ ఇచ్చేశాడు. అందుకే బాలయ్య కోసం కథలు వండడం ప్రారంభించాడు పూరి. అయితే పూరికి కొత్త కథలపై ఎప్పుడూ ఆసక్తి ఉండదు. కథలు రాసుకోవడానికి అట్టే టైమ్ కేటాయించడు. తన దగ్గరున్న కథలనే అటూ ఇటూ మార్చి సినిమాలు చేసేస్తుంటాడు. బాలయ్య కోసం కూడా తన దగ్గరున్న పాత కథ దుమ్ము దులుపుతున్నాడట. పూరి మహేష్ బాబు కోసం ఓ కథ సిద్ధం చేసి, దానికి జనగణమన అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కథని అటూ ఇటూ మార్చి బాలయ్యకు వినిపించాడట పూరి. అది బాలయ్యకు బాగా నచ్చిందని, ఇప్పుడు అదే పేరుతో ఈ సినిమా రూపు దిద్దుకోబోతోందని టాక్. మహేష్ కోసం పుట్టిన కథలో బాలయ్య ఎలా సెట్టవుతాడో ఏంటో..!