మార్చి కి సెప్టెంబర్ కు మధ్య తేడా చెబుతున్న నాని....
on Jan 15, 2017
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘నేను లోకల్’ సినిమా టీజర్ ఇప్పటికే చాలామందికి నచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆసినిమాకు సంబంధించిన కొన్ని డైలాగ్స్ మాత్రం ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో ‘‘ఒక అమ్మాయి తెల్లవారుజామున 4గంటలకు లేచి చదువుకుంటోందంటే.. అది మార్చి అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4గంటలకు లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్ షిప్ బిట్విన్ మార్చి అండ్ సెప్టెంబర్ షుడ్ బి లైక్ ఎ ఫిష్’’ అంటూ నాని చెప్పిన డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. అంతేకాదు ‘వీడు మాములోడు కాదే. జండూబామ్కు కూడా తలనొప్పి తెప్పించే రకం’ అంటూ హీరోయిన్ తండ్రి నాని గురించి చెబుతూ అన్న డైలాగ్.. ‘పరిగెత్తి.. పరిగెత్తి బతికేదానిని జింకా అంటారు. ఆగి.. ఆగి.. కొట్టేదాన్ని పులి అంటారు’ అంటూ నాని చెప్పి మరో డైలాగ్ వింటుంటే సినిమా కూడా మంచి రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. నానీ హీరోగా... కీర్తీ సురేశ్ హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.