ప్రభాస్ బర్త్‌డేకు ఆదిరిపోయే గిఫ్ట్..!
on Sep 27, 2016
టాలీవుడ్లోనే కాకుండా..యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే హైయెస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న మూవీ అంటే టక్కున వచ్చే సమాధానం బాహుబలి-2. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ చిత్రాన్ని 2017 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ కావొచ్చినప్పటికి ఈ చిత్రానికి సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. బాహుబలి-1 విషయంలో నెలకు ఒక్క ఫోటో అయినా రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశాడు జక్కన్న. దీంతో బాహుబలి-2పై అభిమానులు అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే లేటైందని భావిస్తున్న రాజమౌళి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా ప్రభాస్ పుట్టిన రోజున..అంటే అక్టోబర్ 23 నుంచి బాహుబలి ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నాడు. అదే రోజున అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బాహుబలి-2 టీజర్ రిలీజ్ చేయనున్నారు.