పవన్ కడపకింగ్ కాదు.. కాటమరాయుడు
on Aug 30, 2016
కాటమరాయుడా కదిరి నరసింహుడా... అంటూ అత్తారింటికి దారేది కోపం పవన్ కల్యాణ్ గొంతెత్తి పాడాడు. ఇప్పుడు ఆ పాటని మరోసారి గుర్తు చేయబోతున్నాడుపవన్. ఎందుకంటే ఈ పాటలోని పదమే పవన్ కొత్త సినిమాకి టైటిల్ గా మారబోతోంది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా డాలీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కాటమరాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. రాయలసీమ ప్రాంతం చుట్టూ తిరిగే కథ. రాయలసీమలో కాటమరాయుడు భలే ఫ్యామస్. అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేశార్ట. ఈ సినిమా కోసం కడప కింగ్ అనే పేరూ అనుకొన్నారు. కానీ కడప కింగ్ అంటే ఓ ప్రాంతానికి సంబంధించిన టైటిల్‌గా మిగిలిపోతుందని, కాటమరాయుడు అంటే రాయలసీమ మొత్తానికీ రిప్రజెంట్ చేయొచ్చని చిత్రబృందం భావిస్తోంది. సెప్టెంబరు 2 పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.