అలాంటి అభిమానం, అభిమానులు నాకొద్దు..
on Aug 28, 2016
తన అభిమాని చేతిలో మరో హీరో అభిమాని హత్యకు గురైన ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. హత్యకు గురైన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా తిరుపతికి వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అయితే జూనియర్ మాత్రం ఇంకా పెదవి విప్పలేదని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో హద్దులు దాటే అభిమానం, అభిమానులు నాకొద్దు అని జూనియర్ ఘాటుగా స్పందించాడు. హీరోలపై అభిమానం తప్పు కాదని..కానీ ఆ అభిమానం గీత దాటకూడదని చెప్పాడు. అభిమానం ఎప్పుడూ పరిమితుల్లోనే ఉండాలని సూచించాడు. ముందు దేశం, తర్వాత కుటుంబం..ఆ తర్వాతే సినీ హీరోలని తేల్చి చెప్పాడు..హీరోలుగా మా మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పిన ఎన్టీఆర్..భవిష్యత్తులోనూ ఉండబోవని కుండబద్ధలు కొట్టాడు.