అతడిని నమ్ముకుని కెరిర్ నాశనం చేసుకుంది..
on Aug 27, 2016
రంగుల ప్రపంచంలో హీరోయిన్ల కెరిర్ అతి స్వల్పం. మహా అయితే పదేళ్లు.. లేదు కాస్త అదృష్టం కలిసివస్తే ఒక పుష్కరకాలం పాటు బండి లాగగలుగుతారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆశతో కొందరు భామలు ఏకకాలంలో రెండు, మూడు భాషల్లో నటించేస్తుంటారు. టాలీవుడ్లో ఆఫర్లు కాదనుకుని బాలీవుడ్‌కు వెళ్లిన భామలకు ఎందుకో అక్కడ కలిసిరాదు. భారీ సినిమాలు, క్రేజీ డైరెక్టర్స్, స్టార్ హీరోలతో నటించినా సరైన హిట్లు దొరకదు. అసిన్, ఇలియానా, జెనీలియా, త్రిష, కాజల్, తమన్నా ఈ లిస్ట్ పెద్దదే. ఇపుడు వీరితో చేరింది పూజాహెగ్డే. వరుణ్ తేజ్‌తో ముకుంద, నాగచైతన్యతో ఒక లైలా కోసం లాంటి సినిమాలు చేసిన పూజకు ఇక్కడ హీరోయిన్గా మంచి గుర్తింపే వచ్చింది. దీంతో వరుస ఆఫర్లతో ఈ పాప బిజీ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు.
కానీ విచిత్రంగా టాలీవుడ్‌ను కాదనుకుని బాలీవుడ్ చెక్కేసింది పూజ. అక్కడ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ సరసన మొహంజదారో సినిమాలో నటించింది. ఈ సినిమా చేస్తున్న సమయంలో వేరే ఏ సినిమాకి సైన్ చేయకుండా ఆశలన్ని హృతిక్ మీదే పెట్టుకుంది. తీరా మొహంజదారో అట్టర్‌ఫ్లాప్ కావడంతో పూజ భవిష్యత్ ప్రమాదంలో పడింది. టాలీవుడ్లో బ్రహ్మాండమైన కెరిర్ ఏర్పడుతున్న సమయంలో, ఇలాంటి పెద్ద సినిమాపై ఆశలు పెట్టుకుని రెంటికి కాని రెవడిలా తయారైంది. మరిప్పుడు ఆమె తిరిగి తెలుగు సినిమాకు వచ్చినా, ఇక్కడ తీసుకునే వారెవరు...?