ఎన్టీఆర్‌ని ఇబ్బందుల్లో నెట్టిన నిత్యమీనన్
on Aug 26, 2016
ఇద్దరు హీరోలు కలసి పనిచేయడానికి రెడీ గా ఉన్నా.. ఇద్దరు స్టార్ హీరోయిన్ల ని మాత్రం ఒకే సినిమాల్లో లాక్కు రావడం కష్టంగా మారింది. జనతా గ్యారేజ్ సినిమా వెనుక ఉన్న మతలబులు చూస్తుంటే కథానాయికల మధ్య ఈగో క్లాషులు ఏమేరకు ఉంటాయో అర్థమవుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం జనతా గ్యారేజ్. సెప్టెంబరు 1న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో నిత్య, సమంత కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమా ప్రమోషన్లు జరుగుతున్న తీరు.. తనకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి నిత్యమీనన్ జనతా గ్యారేజ్ టీమ్‌పై అసహనం వ్యక్తం చేస్తోందట. తనని అసలు హీరోయిన్‌గానే గుర్తించడం లేదని, ఇలాంటి సినిమాల్లో నటించి పొరపాటు చేశానని తన సన్నిహితుల దగ్గర చెబుతోందట. అంతే కాదు... 100 డేస్ ఆఫ్ లవ్ ప్రమోషన్లలో జనతా గ్యారేజ్‌కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంటే... నిత్య ఎవైడ్ చేస్తోందట. `జనతా గ్యారేజ్ గురించి మాట్లాడను` అని ఖరాఖండీగా చెప్పేస్తోందట. జనతా గ్యారేజ్ ప్రమోషన్లలోనూ నిత్య పాల్గొంటుందో, లేదో... డౌటుగానే మారింది. విడుదలకు ముందు ఇలాంటి లుకలుకలు బయటపడితే.. అది సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఎలాగైనా సరే.. జనతాతో హ్యాట్రిక్ కొట్టాల్సిందే అని ఫిక్సయిన ఎన్టీఆర్‌కి ఇది సరికొత్త తలనొప్పి.