కూల్‌గా దూసుకుపోతున్న రకుల్!
on Aug 25, 2016
త్రివిక్రమ్ టైపు డైలాగ్ లో చెప్పుకోవాలంటే... తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ సీజన్స్ లాంటోళ్లు! వస్తారు, పోతారు! హీరోలు చెట్టు లాంటోళ్లు! వస్తే పాతుకుపోతారు! ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు గుర్తొచ్చిందంటే, ప్రస్తుతం టాలీవుడ్లో రకుల్ ఋతువు నడుస్తోంది! అవును... ఈ ఢిల్లీ పంజాబీ కుడీ సీజనే కొనసాగుతోంది! పెద్ద హీరోలు వరస పెట్టి రకుల్ తో ప్రీతిగా రొమాన్స్ కి రెడీ అయిపోతున్నారు! ఓ అరడజను సినిమాలు ఏక కాలంలో చేస్తోన్న రకుల్ బేబీ ఇప్పటికే బ్రూస్ లీలో చిందేసిన రామ్ చరణ్ తో కలిసి మరోసారి నటిస్తోంది. అంతే కాదు, ధృవ సినిమాలో మంచి దమ్మున్న పాత్రేనట తనది. అంతే కాదు, అటు మరో సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్, మహేష్ ను కూడా ఫ్లాట్ చేసేసింది రకుల్ ప్రీత్. మురుగదాస్ తో మహేష్ చేస్తోన్న సినిమాలో ఈమే ఫీమేల్ లీడ్. ఇలా ఎందుకు అంటున్నామంటే, మహేష్, మురుగదాస్ సినిమాలో మంచి ఇంపార్టెన్స్ వున్న రోల్ అట రకుల్ ది. ఏదో ఊరికే పాటల్లో ఆడిపాడి మాయమైపోయే రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్ కాదట! తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ లైఫ్ టైమ్ చాలా తక్కువ. ఛాన్స్ వున్నప్పుడే యూజ్ చేసుకోవాలి. అందుకే, ఎక్కువ సినిమాలు చేస్తూ... అందులోనే మంచి విషయం వున్న రోల్స్ ఎంచుకుంటూ ముందుకు పోతున్న రకుల్... తెలివైందే!