చిరు లుక్‌పై.... వర్మ సంచలన వ్యాఖ్యలు
on Aug 23, 2016
టాలీవుడ్లో ఏం జరిగినా తనదైన శైలిలో స్పందించి, అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకోవడంలో రాంగోపాల్ వర్మ సిద్దహస్తుడు. పైగా మెగా ఇంటి విషయాలంటే ఆయనకు స్వతహాగానే ఇంట్రస్ట్ ఎక్కువ. చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన టైటిల్ బయటకు రాగానే పెదవి విరిచాడు వర్మ. ఇదేంటైటిల్? ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే చిరు ఖైదీ నెం.786 చేశాడు... ఈ టైటిల్ ఏం బాగోలేదు.. అంటూ స్పందించాడు. మరి అంతలో ఏమనుకొన్నాడో ఏమో, వెంటనే మాట మార్చేశాడు. చిరు ఫస్ట్ లుక్ బయటకు రాగానే మరో ట్వీట్ పెట్టాడు వర్మ. ఫస్ట్ లుక్ చాలా బాగుంది.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం.. ఇంతకు ముందు చిరు లుక్‌పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొంటున్నా.. మెగా అభిమానులకు సారీ.. అంటూ ట్వీట్ చేశాడు. వర్మ స్వతహాగా సారీ చెప్పడు. చేసిన కామెంట్ కూడా వెనక్కి తీసుకోడు. అలాంటిది వర్మ మనసు మార్చుకొన్నాడంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది మరి.