అమలా, విజయ్‌లు విడిపోవడానికి కారణాలేంటి..?
on Jul 29, 2016
తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో హీరోయిన్గా మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది కేరళ కుట్టి అమలాపాల్. రెండేళ్ల ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టి దర్శకుడు విజయ్, అమలా ఒక్కటయ్యారు. ఎక్కడికెళ్లినా కలిసి వెళుతూ "మేడ్ ఫర్ ఈచ్ అదర్"కు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా కనిపించిన ఈ జంట మరీ ఇంత తొందరగా విడిపోవడం దక్షిణాదిలో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఇంత అర్థాంతరంగా వీరి మధ్య చిచ్చు రావటానికి గల కారణాల గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పుకుంటున్నారు. అమల సినిమాల్లో నటించడం విజయ్‌కి ఇష్టం లేదని కొందరంటే... తమిళంలోని ఓ స్టార్ హీరో వల్లే వీరిద్దరూ విడిపోయారంటున్నారు ఇంకొందరు. ఆ హీరోతో ఇప్పటికే పలు చిత్రాలు చేసిన అమలాపాల్ తాజాగా మరో సినిమా చేయడానికి ఒప్పుకొందట. వాళ్లిద్దరు అంత చనువుగా ఉండటం విజయ్‌కి నచ్చలేదని, అందుకే అమలతో తెగదెంపులు చేసుకొన్నాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అసలు విషయమేంటన్నది మాత్రం పక్కాగా తెలియదు.