బికినీ బ్యూటీ పాటలు పాడుతుందంట!
on Jul 28, 2016
బికినీ మోడల్ గా కెరీర్ ను ఆరంభించి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ వరుసగా సూపర్ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. రజనీకాంత్ తో "రోబో 2.0"లో లేడీ రోబోగా నటిస్తున్న అమీ జాక్సన్ త్వరలోనే తెలుగులో మరోమారు మెరవనుంది.
ఇకపోతే అమ్మడు హీరోయిన్ గానే కాక సింగర్ గానూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొంటాను అంటోంది. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం "సింగ్ ఈజ్ బ్లింగ్" చిత్రానికి సంగీతాన్ని సమకూర్చిన మాంజ్ అనే ర్యాప్ మ్యూజిక్ కంపోజర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో అమీజాక్సన్ తన అందాలతో కనువిందు చేయడమే కాకుండా తాను కూడా ఆ ర్యాప్ సాంగ్ లో గొంతు కలపనుందట. మరి అమీ అందాలకు రుచి మరిగిన జనాలు ఆమె గాత్రాన్ని ఏమేరకు ఆదరిస్తారో చూడాలి!