నాని హీరోయిన్ మారింది!
on Jul 27, 2016
గత కొన్ని సంవత్సరాలుగా నాని తన జోరు పెంచాడు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ నేపధ్యంలో తను మరో సినిమాలో నటించడానికి అంగీకరించాడు. త్రినాధరావు నక్కిన చెప్పిన కథ నానికి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎన్నుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఇప్పుడు ఆ స్థానంలోకి అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. మలయాళం ప్రేమమ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ 'అ ఆ' చిత్రంతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. యూత్ లో తనకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో అనుపమ అయితే హీరోయిన్ గా పెర్ఫెక్ట్ అని భావించిన చిత్రబృందం తనను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల ఆగస్ట్ 15 న ఈ సినిమా ప్రారంభం కానుంది. మరి ఈ సినిమా నానికి ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి!