రాణా పెళ్ళి గురించి సురేష్ బాబు కామెంట్!
on Jul 24, 2016
ప్రపంచంలోని ఏ తండ్రైనా తన కొడుకు పెళ్లి తన చేతుల మీదుగా జరగాలని కోరుకొంటాడు. అది మానవ సహజం. అయితే.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాత్రం తన పెద్ద కొడుకు పెళ్లి తన చేతుల మీదుగా జరుగుతుందో లేదో తెలియదని చెబుతున్నాడు. ఇటీవల ఆయన సమర్పణలో విడుదలవుతున్న "పెళ్ళి చూపులు" సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సురేష్ బాబును మీడియా ప్రతినిధులు "మీ అబ్బాయికి పెళ్లి చూపులేప్పుడు" అని సరదాగా అడగ్గా.. "ఏమో నాకు ఆ అవకాశం ఇస్తాడో లేక, వాడే చేసుకొని వచ్చేస్తాడో" నాకైతే తెలియదు అంటూ చమత్కారంగా సమాధానమిచ్చాడు.
హీరోగా పాపులర్ అవ్వడానికంటే ముందు ప్రీ-ప్లాన్డ్ ఎఫైర్లతో బోలెడంత పబ్లిసిటీ సొంతం చేసుకొన్న రాణా ప్రస్తుతం టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్న ఈ తరుణంలో సురేష్ బాబు ఈ విధంగా కామెంట్ చేయడం అందరినీ అమితంగా ఆకర్షిస్తుంది!