కబాలి దూకుడుతో బాహు"బలి"
on Jul 24, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ "కబాలి" కలెక్షన్ల సునామీ బాక్సాఫీసులను ముంచెత్తుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కబాలి ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో అలరించలేకోపోవడంతో రజనీ సైడ్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ సూపర్‌స్టార్ స్టైలే సెపరేటు. సినీ విశ్లేషకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ కబాలి రికార్డులతో విరుచుకుపడుతున్నాడు. యూఎస్ ప్రివ్యూషోకు కబాలి అక్షరాలా రూ.12.93 కోట్లు రాబట్టాడు. అంతకు ముందు యూఎస్ ప్రీమియర్‌లో బాహుబలి రూ.9.28 కోట్లు సాధిస్తే, సుల్తాన్ రూ.5.27 కోట్లు వసూలు చేసింది. దీంతో పాటు ఒక్కరోజులోనే దాదాపు 100 కోట్ల కలెక్షన్లు సాధించి భారతదేశంలో ఏ స్టార్ హీరో సాధించని ఫీట్‌ను రజనీ సాధించాడు. ఇంకొన్ని రోజులు కబాలి మేనియా కొనసాగే అవకాశం ఉండటంతో ఇంకెన్ని రికార్డులు బద్ధలవుతాయో వేచి చూడాలి.