సింగర్ గా మారిన అమీర్ ఖాన్!
on Jul 23, 2016
కథానాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా ఒక్కటేమిటి అన్నీ రంగాల్లోనూ ప్రవేశించి తనదైన మార్క్ ను వేసిన నటుడు అమీర్ ఖాన్. పాత్రలో జీవించడానికి అమీర్ శ్రమించే విధానం చూసి అందరూ అతడ్ని "మిస్టర్ పర్ఫెక్ట్" అని పిలుచుకొంటారు. ప్రస్తుతం "దంగాల్" అనే సినిమా కోసం బాగా కండలు పెంచి భీకరంగా తయారైన అమీర్ ఖాన్ ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
తాజా సమాచారం ప్రకారం "దంగాల్" చిత్రం కోసం ప్రీతమ్ సంగీత సారధ్యంలో ఓ హిందీ ర్యాప్ సాంగ్ ను పాడినట్లు సమాచారం అందుతోంది. తను చేసే ప్రతి పనిలోనూ పర్ఫెక్షన్ చూపే అమీర్ ఖాన్ సింగర్ గానూ అదే రీతిలో తనదైన మార్క్ చూపాడని, చాలా అవలీలగా పాట చిత్రీకరణ పూర్తి చేశాడని టాక్. ఎంతైనా మిస్టర్ పర్ఫెక్ట్ కదా.. ఆమాత్రం పర్ఫెక్షన్ చూపకపోతే ఎలా చెప్పండి!