రజిని ఓల్డ్ లుక్ లో కనిపించేది 20 నిమిషాలే!
on Jun 26, 2016
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.తాను నిర్మిస్తోన్న చిత్రం 'కబాలి'. ఈ సినిమా గురించి దర్శకుడు రంజిత్ విలేకర్లతో ముచ్చటించాడు. ''నేను దర్శకత్వం వహించిన 'మద్రాస్' సినిమా రజినీకాంత్ గారికి బాగా నచ్చింది. ఆ సినిమాను రెండు సార్లు చూశారు. అందుకే నాకు ఆయన సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. నాకు లైఫ్ ఇచ్చిన సినిమా మద్రాస్. రజినీకాంత్ గారి కూతురు సౌందర్య నాకు ఫ్రెండ్. ఒకసారి ఫోన్ చేసి నాన్న కలవమన్నారని చెప్పింది. ఆయనతో కలిసి పని చేయాలని ప్రతి డైరెక్టర్ కోరుకుంటాడు. కానీ ఆయన అందరినీ కాదని నాకు అవకాశం ఇచ్చారు. నేను కథ చెప్పినప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యారు. ఆయనకు యంగ్ డైరెక్టర్స్ తో పని చేయాలంటే ఇష్టం. అయితే ఆయన ఈ సినిమాలో ఓల్డ్ లుక్ లో కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. మిగిలిన సినిమా మొత్తం యంగ్ లుక్ లోనే కనిపిస్తారు. ఆయనను యంగ్ గా చూపించడానికి 1980 లలో రజినీకాంత్ గారు నటించిన సినిమాల్లో ఫోటోలు రిఫరెన్స్ గా తీసుకున్నాను అని చెప్పారు.