ENGLISH | TELUGU  

సల్మాన్‌కు "రేప్" సెగ..10 కోట్లు ఇవ్వాలంటూ నోటీసులు

on Jun 26, 2016

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ రేప్ కామెంట్స్ దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగుతోంది. తాజాగా ఓ అత్యాచార బాధితురాలు సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. అక్కడితో ఆగకుండా రూ.10 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ సల్లూ భాయ్‌కి నోటీసులు పంపింది. హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన ఆ యువతి సల్మాన్‌కు వీరాభిమాని. నాలుగేళ్ల క్రితం ఈ యువతి సామూహిక ఆత్యాచారానికి గురైంది. ఆ కేసులో న్యాయస్థానం నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇప్పటీకి ఈ కేసులో విచారణ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సల్మాన్ వ్యాఖ్యలు ఆమెకు ఆగ్రహం కలిగించాయి. ఒకప్పుడు సల్మాన్‌కి వీరాభిమానిని..సల్మాన్ అన్న మాటలకి ఇప్పుడు అతనంటేనే ద్వేషం కలుగుతోంది. మాలాంటి వారు అనుభవిస్తున్న బాధను అర్థం చేసుకోకుండా సల్మాన్ మాపై జోక్స్ వేశాడు. తమను కించపరిచేలా మాట్లాడినందుకు రూ.10 కోట్లు చెల్లించాలని లేకపోతే క్రిమినల్, సివిల్ కేసులు పెట్టాల్సి వస్తుందని నోటీసులో పేర్కొంది. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.