బాలీవుడ్ హీరోయిన్ తెలుగు నేర్చుకుంటోంది!
on Jun 26, 2016
మహేష్ బాబు, మురుగుదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అవకాశాలు లేని ఈ భామకు మూడు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఇక్కడకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం పరిణీతి తెలుగు నేర్చుకుంటుందట. ఈ విషయాన్ని పరిణీతి కన్ఫర్మ్ చేస్తూ.. ''నా మొదటి సినిమాకే నేను డబ్బింగ్ చెప్పేయాలని కాదు.. కనీసం సెట్ లో నేను చెప్పే డైలాగ్స్ నాకు అర్ధం కావాలి. అప్పుడే బాగా నటించగలుగుతాను. దానికోసం తెలుగు భాష పరిచయముండాలి. అందుకే ట్యూటర్ ను పెట్టుకొని మరీ తెలుగు నేర్చుకుంటున్నాను'' అని చెబుతోంది ఈ భామ. మరి తెలుగులో ఈ బ్యూటీకి ఎలాంటి బ్రేక్ వస్తుందో చూడాలి..!
Also Read