చిరంజీవి సరసన బాలీవుడ్ బికినీ బేబీ!
on Jun 26, 2016
మెగా 150 సినిమా మొదలవ్వక ముందు వరకూ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అని ఎదురుచూస్తూ వచ్చిన జనాలు.. సినిమా గత గురువారం మొదలైనప్పట్నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారా? అనే విషయం గురించి చర్చించుకోవడం మొదలెట్టారు. చూస్తుంటే ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తొలుత ఈ చిత్రంలో కథానాయికలుగా టాలీవుడ్ ముద్దుగుమ్మలు అనుష్క, నయనతారల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత బాలీవుడ్ బొద్దుగుమ్మలు పరిణీతి చోప్రా, విద్యాబాలన్ లు తెరపైకి వచ్చారు. చివరికి బాలీవుడ్ బికినీ బేబీ నర్గీస్ ఫక్రీని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి చిరంజీవి సరసన నర్గీస్ ఎంతవరకూ సూట్ అవుతుంది అనే విషయం దర్శకనిర్మాతలకే తెలియాలి!