క్రిష్ నిశ్చితార్థంలో బాలయ్య సందడి...!
on Jun 25, 2016
గమ్యం, వేదం, కంచె వంటి వినూత్నమైన సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. కేర్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న రమ్యతో క్రిష్ నిశ్చితార్థం హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు - పరిమిత సంఖ్యలో హాజరైన సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం ఇది. శనివారం జరిగిన నిశ్చితార్థం వేడుకలో డాక్టర్ రమ్యకి ఉంగరం తొడిగాడు క్రిష్. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోంది. ఈ కార్యక్రమంలో క్రిష్,రమ్యల కుటుంబ సభ్యులతో పాటు నందమూరి బాలకృష్ణ దంపతులు కూడా పాల్గొన్నారు. గమ్యంతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన క్రిష్ ప్రస్తుతం బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిని తెరకెక్కిస్తున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాతే క్రిష్ పెళ్లి జరగొచ్చని తెలుస్తోంది