ఇరగదీస్తున్న సల్మాన్ సుల్తాన్ ట్రైలర్..!
on May 25, 2016
బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సల్మాన్ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసిన ట్రైలర్ సుల్తాన్. ఈ ఏడాది వస్తున్న సినిమాలన్నింటిలోనూ, ఈ మూవీకే సూపర్ క్రేజ్ ఉందంటే ఆశ్చర్యం లేదు. ఇప్పటికే వరసగా భారీ బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సల్మాన్ ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంటాడని విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా కోసం సల్మాన్ శారీరకంగా చాలా కష్టపడ్డాడు. రెజ్లర్ లా కనిపించడం కోసం, తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. సల్మాన్ తో పాటు సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న అనుష్క శర్మ కూడా రెజ్లింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం మూవీ ట్రైలర్ కు యూట్యూబ్, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో విపరీతమైన స్పందన లభిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఒకప్పుడు వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ గా నిలిచిన వ్యక్తి, ఆ వృత్తిని వదిలేసిన తర్వాత మళ్లీ పోరాడాల్సిన పరిస్థితుల్లో, అతను ఎలా గెలిచాడు అనేది సినిమా కథ. హాలీవుడ్ లో ర్యాంబో సీరీస్ లో ఈ తరహా సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా ఇంచుమించు అలాగే ఉండబోతుందని సినీజనాల అభిప్రాయం. విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్న సుల్తాన్, ఈ ఈద్ కు విడుదలకు ముస్తాబవుతోంది.
Also Read