పాపం మహేష్ బాబు..రెండో అవకాశం ఇచ్చి దెబ్బయ్యాడు..!
on May 24, 2016
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఒకసారి ఒక డైరెక్టర్ తో హిట్ కొడితే, మళ్లీ అదే దర్శకుడితో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు మన హీరోలు. మహేష్ బాబు దీనికి మినహాయింపు కాదు. ఆయన కూడా తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడి కాంబినేషన్లో మరో సినిమా చేశారు. అయితే, సెంటిమెంట్ గా ఇది కూడా మహేష్ వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. ఉదాహరణకు శ్రీను వైట్లతో చూస్తే, దూకుడు లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చి, వెంటనే ఆగడు లాంటి డిజాస్టర్ ను మహేష్ జేబులో పెట్టాడు. మహేష్ తో సెకండ్ టైమ్ సినిమా చేసిన దర్శకులందరిదీ ఇదే తీరు. గుణశేఖర్ తో మొదట ఒక్కడు ఇండస్ట్రీ హిట్. ఆ తర్వాత తీసిన అర్జున్, సైనికుడు గట్టిగా దెబ్బకొట్టాయి. త్రివిక్రమ్ తో అతడు సూపర్ హిట్. అదే త్రివిక్రమ్ తో కలిసి తీసిన మరో సినిమా ఖలేజా యావరేజ్ టాక్ దాటలేకపోయింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో పోకిరీ తర్వాత బిజినెస్ మ్యాన్ చేశాడు. ఆ మూవీ యావరేజ్ గా ఆడి వెళ్లిపోయింది. ఇక శ్రీను వైట్ల తెలిసిందే. రీసెంట్ గా సీతమ్మ వాకిట్లో సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు బ్రహ్మోత్సవం అవకాశం ఇచ్చాడు. ఇది ఇప్పుడు మహేష్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ అంటున్నారు. సెంటిమెంట్ గా చెప్పాలంటే, మహేష్ కు సెకండ్ సినిమా దర్శకులు కలిసిరాలేదు. మరి ఇక నుంచీ డైరెక్టర్లను రిపీట్ చేయకుండా మహేష్ ట్రై చేస్తాడేమో చూద్దాం.