హాలీవుడ్ సింగర్ ను ఇష్టపడుతున్న ప్రియాంక చోప్రా..!
on May 23, 2016
హాలీవుడ్ సింగర్ పై ప్రియాంక చోప్రా మనసు పడింది. తెగ ఇష్టపడుతోంది. తనకు ఆ సింగర్ అంటే క్రష్ అని కూడా చెబుతోంది. విచిత్రమేంటంటే ఆ సింగర్ అబ్బాయి కాదు. అమ్మాయి. విషయంలోకి వెళ్తే, ఈ నెల 22 న లాస్ వెగాస్ లో బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ ఈవెంట్ కు హాజరైన ప్రియాంక, అక్కడ సింగర్ మేగన్ ట్రైనర్ పాడిన పాటలకు మైమరిచిపోయింది. ఆమె పాటలు ప్రియాంకకు తెగ నచ్చేశాయట. మేగన్ తో పాటు మిగిలిన సెలబ్స్ తో తీసుకున్న ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ప్రియాంక. షేర్ చేస్తే ఫర్లేదు. ఆ ఫోటోకు ఒక స్టేటస్ కూడా యాడ్ చేసింది. ఈ అమ్మాయి నాకు ఉమెన్ క్రష్. అవార్డ్స్ ప్రోగ్రామ్ లో చించేశావ్. మోర్ పవర్ టు యు అంటూ ట్వీట్ చేసింది ప్రియాంక. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ లో క్వాంటికో టీవీ సీరీస్ తో పాటు, బేవాచ్ సినిమాలో విలన్ గా చేస్తోంది.