స్టార్ హీరో కూతురి బాయ్ ఫ్రెండ్ ఇతనేనా..?
on May 6, 2016
స్టార్స్ మాత్రమే కాదు. వాళ్ల పిల్లలు కూడా జాగ్రత్తగా బాధ్యతగా ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ల తల్లిదండ్రుల మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ ను పిల్లల మీద కూడా మీడియా పెడుతుంది. స్టార్స్ కొడుకులు, కూతుళ్లు ఏ పని చేసినా వెంటనే బయటికి వచ్చేస్తుంది. ఇప్పటి వరకూ మీడియా హిట్ లిస్ట్ లో షారుఖ్ కొడుకు, అమితాబ్ మనవరాలు, శ్రీదేవి కూతుళ్లు, ఇలా బాలీవుడ్ స్టార్స్ పిల్లల లిస్ట్ పెద్దదే ఉంది. తాజాగా ఈ లిస్ట్ లో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కూడా చేరింది. సైఫ్ కు మొదటి భార్యకు పుట్టిన ఈ అమ్మడు ఇప్పుడు పెద్దదైపోయింది. రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ మీడియా కేమేరాలకు చిక్కింది. ఇన్నాళ్లూ పిల్లల్ని మీడియా కంట పడకుండానే సైఫ్ జాగ్రత్తగా పెంచుకొచ్చాడు. కానీ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ పుణ్యమా అని, పర్సనల్ లైఫ్ అంతా నెట్టింట్లో కనిపిస్తోంది. ముద్దులు పెట్టుకుంటూ సారా క్లోజ్ గా మసులుతున్న ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీస్తే, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ మనవడు అని, పేరు వీర్ పహారియా అని తేలిందట. ప్రస్తుతం సైఫ్ కూతురికి, ఆ కుర్రాడికి ప్రేమాయణం నడుస్తోందని, డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్వరలోనే బాలీవుడ్ లో అడుగుపెట్టే ఆలోచనలో ఉన్న ఈ భామ, ఇలా బాయ్ ఫ్రెండ్ తో జల్సా చేస్తూ దొరికిన ఫోటోలే ఇప్పుడు టాక్ ఆఫ్ ది బీ టౌన్ గా మారాయి..