వర్మ ' వంగవీటి ' హీరో ఇతడే..
on Feb 6, 2016
వంగవీటి రంగాపై ' వంగవీటి ' పేరుతో సినిమా చేస్తున్నానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమాకు సంబంధించి హీరోను సెట్ చేసినట్టే కనబడుతోంది. తన ట్విట్టర్లో, రంగాను పోలిన గెటప్ తో ఒకరి ఫోటో పెట్టి, ' మై రంగా ' అంటూ ట్వీట్ చేశారు. రంగాతో పాటు, వంగవీటి రాథా పాత్రకు కూడా నటుల్ని ఎంచుకున్నారు వర్మ. సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండా పూర్తి చేసేయడం వర్మ శైలి. ఈ పాటికే ' వంగవీటి ' సినిమా సగం షూటింగ్ పూర్తైపోయినా ఆశ్చర్యం లేదంటున్నాయి సినీ వర్గాలు. మరి అసలు విషయం ఏంటో వర్మే చెప్పాలి..