గుణశేఖర్ ఎన్టీఆర్ ను అందుకే తీసుకోలేదంట..
on Oct 6, 2015
గుణశేఖర్ ఎంతో కష్టపడి చేసిన సినిమా రుద్రమదేవి. ఎన్నో ఒడుదుడుకులు తట్టుకుని ఎట్టకేలకు ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ప్రమోషన్లో ఉన్న గుణశేఖర్ ఈ సినిమా గురించి తాను గతంలో తీసిన సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈసినిమాలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో నటించారు. అయితే ఈపాత్రలో అల్లు అర్ఙున్ కంటే ముందు ఎన్టీఆర్ ని అనుకున్నారంట గుణశేఖర్. అప్పుడు తనకు స్టోరీ చెప్పినప్పుడు కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడట. కానీ ఈ పాత్రలో నటించడానికి తను ఓ కండీషన్ పెట్టాడట. అదేంటంటే తాన పాత్రను ఇంకా డెవలప్ చేసి హీరోగా మార్చాలని అన్నారట. అయితే ఇది లేడి ఒరియెంటెడ్ సినిమా.. రుద్రమదేవి పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి.. అందుకే గోనగన్నారెడ్డి పాత్రలో ఎన్టీఆర్ ను తప్పించి అల్లు అర్జున్ ను రీప్లేస్ చేశారంట. అంతేకాదు చిరంజీవి మృగరాజు ప్లాప్ అవ్వడానికి కారణం కూడా చెప్పారు. అది తన స్టోరీ కాదని.. ఘోస్ట్ అండ్ ది డార్క్ నెస్ మూవీ ఆధారంగా నాగబాబు తయారు చేయించిన స్టోరీ అని చెప్పాడు. మొత్తానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా ఎన్నోకష్టాలు పడి వస్తున్న రుద్రమదేవి హిట్ కావాలని కోరుకుందాం.