'పవర్' షూటింగ్లో ఫైర్ యాక్సిడెంట్ !
on Jul 28, 2014
థాయ్లాండ్ లో షూటింగ్ జరుపుకుంటున్న 'పవర్' చిత్ర యూనిట్ అగ్నిప్రమాదానికి గురైనట్లు సమాచారం. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు పటాయా దగ్గరలో గల అడవిలో చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో యూనిట్ సభ్యులు అందరూ క్షేమంగా వున్నారని భావిస్తున్నారు. షూటింగ్ నిమిత్తం వాడిన పేలుడు పదార్థాల వలన అడవిలో మంటలు రేగి ఉండవచ్చవని అనుకుంటున్నారు.
రవితేజ, హన్సిక, రెజీనా నటిస్తున్న ఈ చిత్రానికి కే.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.