ENGLISH | TELUGU  

" కబాలి" దర్శకుడు పా.రంజిత్‌ ఇంటర్వ్యూ

on Jun 26, 2016

రజనీకాంత్ గారు కథ ఒకే చేయగానే సంతోషంతోపాటు భయం కూడా వేసింది!

-దర్శకుడు పా.రంజిత్ 

 

"పా.రంజిత్" నిన్నటివరకూ కేవలం తమిళ తంబిలకు మాత్రమే పరిచయమైన ఈ పేరు నేడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం "పా.రంజిత్" అనే వ్యక్తి పేరు విననివాడు ఉండడేమో. అయితే.. ఇదంతా కేవలం రజనీకాంత్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం వల్ల వచ్చిన పరపతికాదు, అతగాడి ఆరేళ్ళ శ్రమకు ఫలితం ఇది. రాజనీకాంత్ స్వయంగా పిలిచి మరీ "నాకో సినిమా చేసిపెట్టవయ్యా" అని అడిగాడంటేనే అర్ధం చేసుకోవచ్చు పా.రంజిత్ స్టామినా ఏంటన్నది. అలాగని అతడి మునుపటి సినిమాలు సూపర్ హిట్లేమీ కావు, కానీ సదరు సినిమాల్లో క్యారెక్టర్లను ఎలివేట్ చేసిన తీరు, కథనాన్ని నడిపించిన విధానం మాత్రం అద్భుతం. బహుశా ఆ విషయాల్ని గమనించే పా.రంజిత్ ను పిలిచి మరీ రజనీ తన సినిమాకు

దర్శకత్వం వహించే సువర్ణావకాశాన్నిచ్చాడేమో..!?
నేడు (జూన్ 26) "కబాలి" తెలుగు వెర్షన్ ఆడియో విడుదల వేడుక జరిగింది. ఈ సందర్భంగా హైద్రాబాద్ వచ్చిన పా.రంజిత్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. 

రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో పని చేసే అవకాశం వస్తుందని ఎప్పుడైనా ఊహించారా ?
"మద్రాస్" సినిమా తర్వాత సూర్య కోసం ఒక సబ్జెక్ట్ ను సిద్ధం చేసుకొంటున్నాను. అదే సమయంలో రజనీ సార్ కుమార్తె, నాకు మంచి స్నేహితురాలు అయిన సౌందర్య ఫోన్ చేసి "నాన్నగారికి ఒక సినిమా చేసిపెట్టాలి" అని చెప్పింది. అలా ఆమె అడగడమే ఆలశ్యం రజనీ సార్ కోసం కథ సిద్ధం చేసేశాను. ఆ తర్వాత రజనీ సార్ కి కథ చెప్పడం, ఆయన కథను ఫస్ట్ సిట్టింగ్ లోనే ఒకే చేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. 

కథ చెప్పిన తర్వాత రాజనీకాంత్ ఎలా స్పందించారు ?
అప్పటికే రజనీ సార్ నేను దర్శకత్వం వహించిన "మద్రాస్" సినిమాను రెండుసార్లు చూశారట. నేను గంటన్నరపాటు నేరేషన్ ఇచ్చాను, రజనీకాంత్ గారు కథలో ఒక్క మార్పు కూడా చెప్పకుండా "చాలా బాగుంది" అన్నారు. నాకు పట్టరాని ఆనందంతోపాటు కాస్తంత భయం కూడా వేసింది. అన్నిటికంటే ముఖ్యంగా.. నేను రజనీ సార్ చెప్పిన ఏకైక స్క్రిప్ట్ "కబాలి". 

 

రజనీ లుక్ ను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు ?
రజనీకాంత్ గారికి నేను కథ చెబుదామని వెళ్ళేప్పటికే.. ఆయన సగం మాసిన గెడ్డంతో కాస్త అటుఇటుగా "సాల్ట్ అండ్ పెప్పర్" లుక్ లోనే ఉన్నారు. అందుకే సినిమాలో ఆయన పూర్తి స్థాయి "సాల్ట్ అండ్ పెప్పర్" లుక్ లో కనిపిస్తే బాగుంటుందని అనుకొన్నాను. ట్రై ఫోటోషూట్ చేసినప్పుడు ఆయనకి ఆ లుక్ అద్భుతంగా కుదిరింది. పోస్టర్లలో చూస్తున్నారు కదా.. ఎంత స్టైలిష్ గా కనిపిస్తున్నారో!

టీజర్ కి ఆ రేంజ్ రెస్పాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారా?
అస్సలు ఎక్స్ ఫెక్ట్ చేయలేదు. తమిళ టీజర్ మాత్రమే కాకుండా తెలుగు టీజర్ కు కూడా విశేషమైన స్పందన లభించింది. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే సినిమాపై ఉన్న అంచనాలు ఏంటన్నది అర్ధమైంది నాకు. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ చేసేప్పుడు ఇంకాస్త జాగ్రత్త వహించాను. 

రజనీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
రజనీకాంత్ గారు ఈ సినిమాలో మలేసియన్ డాన్ గా కనిపిస్తారు. బ్రిటిష్ రూలింగ్ టైమ్ లో మలేసియాలోని రబ్బర్ ఫ్యాక్టరీ పనిచేసే కూలీగా కెరీర్ ను మొదలుపెట్టి డాన్ గా ఎలా ఎదిగాడు? డాన్ గా మారాక అతడి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకొన్నాయి? అనేది సినిమా కథాంశం. 

యంగ్ రజనీకాంత్ ను కూడా చూపెట్టినట్లున్నారు ?
సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. ఒక్క 20 నిమిషాల మాత్రమే ఆయన యంగ్ లుక్ లో కనిపిస్తారు. ఆ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. అలాగే.. ముసలి డాన్ గానూ రజనీ నటన, ఆయన స్టైల్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. 

 

"కబాలి" అంటే అర్ధం ఏమిటి?
"కబాలి" అనేది తమిళనాడులో లోకల్ దాదాలు, రౌడీ మూకల్లో మెయిన్ పర్సన్స్ "కబాలి" అనే పేరు పెట్టుకొనేవారు. సో, "కబాలి" అనేది బేసిగ్గా ఓ విలన్ పేరు. కానీ.. రజనీకాంత్ గారు మాత్రం ఈ సినిమాలో సూపర్ హీరోలా కనిపిస్తారు. 

"కబాలి" సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి, వాటిని అందుకోగలరన్న నమ్మకం ఉందా ?
రజనీ సార్ సినిమా అంటే ఆటోమేటిక్ గా భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. అయితే.. "కబాలి" విషయంలో మాత్రం అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే.. ఆ అంచనాలను అందుకోగలమన్న పూర్తి నమ్మకం నాకుంది. "కబాలి" కేవలం యాక్షన్ సినిమా కాదు. ఇది ఒక డాన్ ఎమోషనల్ జర్నీ. అన్నీ అంశాలూ సమపాళ్లలో మేళవించబడిన సినిమా ఇది. అన్నీ వర్గాల ప్రేక్షకులనూ తప్పకుండా అలరిస్తుందన్న పూర్తి విశ్వాసముంది. 

మీ నమ్మకం చూస్తుంటే.. సూపర్ హిట్ కొట్టేలా ఉన్నారు? 
సూపర్ హిట్ కొట్టాలన్న కసితోనే ఈ సినిమా చేశాను. రజనీ సార్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతోపాటు.. దర్శకుడిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకోవాలన్నది నా ఆశయం. అది "కబాలి" సినిమా ద్వారా జరుగుతుందని నా నమ్మకం. 

మీ నెక్స్ట్ సినిమా ఎవరితో? తెలుగు నుంచి ఏమైనా ఆఫర్లు వస్తున్నాయా ?
"కబాలి" అనంతరం నా నెక్స్ట్ సినిమా సూర్యతో ఉంటుంది. ఇదివరకే ఆయన కోసం స్క్రిప్ట్ రెడీ చేసేశాను. ఇక తెలుగు నుంచి కూడా పలువురు హీరోలు నన్ను సంప్రదిస్తున్నారు. వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ.. తెలుగులోనూ సినిమాలు చేయాలన్న ఆలోచన మాత్రం ఉంది. 

కాంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ తెలుగు వన్ డాట్ కామ్..
థ్యాంక్స్ అండి!
 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.