బాలయ్య ‘పైసా వసూల్’.. పైసా వసూలే..!
on Jun 10, 2017
నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఆయన నటిస్తున్న 101వ చిత్రానికి ‘పైసా వసూల్’ పేరు ఖరారు చేసి ఫస్ట్ లుక్ పోస్లర్లు విడుదల చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్ రెండు పోస్టర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో బాలయ్య లుక్ అందరికీ తెగ నచ్చేసింది. పూరీ సినిమాలో హీరోలను ఎంత ఎనర్జిటిక్ గా చూపిస్తారో... అలా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బాలయ్య ఫుల్లు స్టైయిలిష్ లుక్ లో అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి పోస్టర్స్. ఓ పోస్టర్ లో బాలకృష్ణ ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఈ పోస్టర్ లో ఒక్క దెబ్బకు మిగతావాళ్లు అందరూ ఒక్కక్కరు ఒక్కో తీరుగా ఎగిరిపడుతుంటారు. ఇక మరో పోస్ట్రర్ లో డాన్స్ స్టెప్ ఉంది. ఈ పోస్ట్రర్ లో బాలయ్య మోడ్రన్ లుక్ తో చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాడు. దీంతో బాలయ్య ‘పైసా వసూల్’ పోస్టర్స్ అదరహో అంటున్నారు. అంతేకాదు 'పైసా వసూల్' సినిమా పైసా వసూలే అని కూడా అంటున్నారు.
ఇదిలా ఉండగా భవ్య క్రియేషన్స్ పతాకంపై.. పూరీ, బాలయ్యల డిఫరెంట్ కాంబోతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. ఇక ఈ ఫస్ట్ లక్ పోస్టర్స్ చూసిన తరువాత బాలయ్య కూడా ఈసినిమాలో పూరి జగన్నాథ్ స్టయిల్లో బాగానే రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తోంది. మరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అయితే మంచి రెస్పాన్స్ యే వచ్చింది.. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.
Also Read